Healthhealth tips in telugu

ఈ ఒక్క గ్లాస్ డ్రింక్‌తో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం మాయం.. ఆకలి కూడా పెరుగుతుంది!

Indigestion problem :ఈ ఒక్క గ్లాస్ డ్రింక్‌తో గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం మాయం.. ఆకలి కూడా పెరుగుతుంది.. ఈ రోజుల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా, ఎక్కువగా మసాలా,కారం ఉండే ఆహారాలను తీసుకోవటం వలన అజీర్ణం,గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయి.

కాస్త ఆహారం ఎక్కువగా తీసుకున్న ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలతో చాలా సులభంగా బయట పడవచ్చు.
Acidity home remedies
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ సొంపు, అంగుళం అల్లా ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వాము,రెండు లవంగాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి వడకట్టి తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన అజీర్ణ సమస్యలు తగ్గటమే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతారు. ఈ రెమిడీలో ఉపయోగించిన సొంపు,అల్లం,లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."