టమోటా, కీరదోస కలిపి తింటున్నారా? అయితే మీ శరీరంలో జరిగేది ఇదే!
Tomato cucumber juice : సలాడ్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి టమోటా మరియు కీరదోస. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఎక్కువగా ఈ రెండింటినీ కలిపి తినడానికి ఇష్టపడతారు.
కానీ, టమోటా, కీరదోస కలిపి తీసుకుంటే శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి మంచిదేనా? లేక గ్యాస్, అజీర్తి లాంటి సమస్యలు తెస్తుందా? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్‌లో చదివి తెలుసుకోండి.
కీరదోస,టమోటాలలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది చాలా మందిని వేదిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడటానికి టమోటా,కీరదోస రెండు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. దీని కోసం ఒక జ్యూస్ తయారు చేసుకోవాలి.

ఒక మిక్సీ జార్ లో ఒక టమోటా ముక్కలు, కీరదోసలో సగాన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 10 పుదీనా ఆకులు,రెండు మిరియాలు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేసి గ్లాసులో పోసి అరచెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. టమోటా,కీరదోస రెండింటిలో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఈ డ్రింక్ ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

