Beauty Tips

Chapped Lips : పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి..

Chapped Lips : పెదాలు నల్లగా మారి పగులుతున్నాయా.. ఇలా చేయండి.. చలికాలం వచ్చిదంటే చాలు. చర్మ సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా పెదాలు కూడా పగులుతుంటాయి. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి సమస్యల్ని దూరం చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకోండి.

పెదాలు పొడిగా మారినప్పుడు పగుళ్లు వస్తూ ఉంటాయి. అలాగే పెదాల పగుళ్ళ కారణంగా పెదాలు నల్లగా మారతాయి. పెదాలు పగుళ్లు లేకుండా ఎర్రగా ఉంటేనే ముఖానికి అందం. పెదాలు పగిలినప్పుడు లిప్ బామ్ వంటివి వాడవలసిన అవసరం లేదు. ఇంటిలోనే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.
Dry lips beauty tips
పెదాల పగుళ్లు,నలుపును తగ్గించటానికి కొత్తిమీర చాలా బాగా సహాయపడుతుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్స్,విటమిన్ A ఉండుట వలన హీలింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పెదాలు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కొత్తిమీరను మెత్తని పేస్ట్ గా తయారుచేసుకొని పెదాలపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.

పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా మూడు రోజుల పాటు చేస్తే పెదాల పగుళ్లు,నలుపు తగ్గి మృదువుగా కాంతివంతంగా మారతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."