Healthhealth tips in telugu

Sore Throat: గొంతు గరగర, నొప్పి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు

Sore Throat: గొంతు గరగర, నొప్పి సమస్యలకు అద్భుతమైన చిట్కాలు.. గొంతు గరగర లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్… సమస్య చిన్నదే కావచ్చు, కానీ ఎక్కువమందిని తరచూ ఇబ్బంది పెడుతున్న సమస్య. దీనికి పెద్దగా మందులు మింగాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.

మనలో చాలా మంది గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్, జలుబు దగ్గులతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి కొంచెం కూలింగ్ వాటర్ తాగిన లేదా చల్లని పదార్థాలు తీసుకున్నా వెంటనే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇలా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు తినాలన్నా తాగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది.
Tulasi health benefits In telugu
గొంతులో గర గర, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వంటి వాటిని తగ్గించడానికి మనం ఈ రోజు ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా పాటిస్తే ఎటువంటి మందుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం సాధ్యమైనంత వరకు సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఉపయోగించి నయం చేసుకోవడం చాలా మంచిది. .

అవసరమైతే మందులు వేసుకోవటం తప్పదు. ఎక్కువగా మందులు వేసుకోకూడదు. ఇక మనం చిట్కాలోకి వెళ్ళిపోదాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో చిన్న అల్లం ముక్క,2 యాలకులు,పది తులసి ఆకులు,పావు స్పూన్ పసుపు వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.

సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా ప్రకారం సూచనలను పాటిస్తూ ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. ఈ చిట్కాకి ఉపయోగించిన అన్నీ పదార్ధాలు శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచేవే. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా ఈ డ్రింక్ తాగటం మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ