Healthhealth tips in telugu

రోజుకు 1 స్పూన్ చాలు.. పిల్లలు, పెద్దల్లో కడుపులో నులిపురుగులు శాశ్వతంగా మాయం!

Remedies For Intestinal Worms Nuli Purugulu : మీ పిల్లలు ఎంత తిన్నా సన్నగానే ఉంటున్నారా? తరచుగా కడుపునొప్పి అని ఏడుస్తున్నారా? అయితే వారి కడుపులో నులిపురుగులు ఉండొచ్చు! కేవలం ‘ఒక్క స్పూన్’ ఇంటి వైద్యంతో పిల్లలైనా, పెద్దలైనా ఈ నులిపురుగుల బాధ నుండి శాశ్వతంగా ఎలా విముక్తి పొందాలో ఈ బ్లాగ్‌లో వివరంగా చదవండి.

కడుపులో నులిపురుగుల సమస్య అనేది సాదరణంగా చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో అరుదుగా కనిపిస్తుంది. అపరిశుబ్రత వలన కడుపులో నులిపురుగులు ఏర్పడతాయి. నులి పురుగుల సమస్య ఉన్నప్పుడు తరచుగా కడుపు నొప్పి రావటం,ఆకలి లేకపోవటం, నీరసం, రోగనిరోధక శక్తి తగ్గటం వంటి లక్షణాలు కనపడతాయి.
Home remedy for reduce worms in stomach
కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం చాలా ముఖ్యం. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో చిటికెడు లవంగాల పొడి వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పిల్లలు అయితే అరస్పూన్ మోతాదులో,పెద్దవారు అయితే ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. మూడు రోజుల పాటు ఇలా తీసుకుంటే నులిపురుగుల సమస్య తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు పొట్టలో ఉండే నులిపురుగులు, సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

లవంగాలలో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు నులిపురుగులు ప్రేగుల్లో గుడ్లు పెట్టనివ్వకుండా చేస్తుంది. అలాగే నులిపురుగులు,సూక్ష్మజీవులను నాశనం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."