వేసవిలో సెగ గడ్డలతో బాధపడుతున్నారా…ఇలా చేస్తే చాలు జీవితంలో అసలు రావు
sega Gaddalu Home Remedies : ఈ వేసవిలో వచ్చే సమస్యలలో సెగ గడ్డలు ఒకటి. సెగ గడ్డలు వచ్చినప్పుడు సమస్య చిన్నగా అనిపించినా బాధ,నొప్పి విపరీతంగా ఉంటాయి. వీటిని తగ్గించుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మందులను కూడా వాడుతూ ఉంటారు. వీటి కోసం ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి.

వెల్లుల్లి సెగ గడ్డలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వలన ఇన్ ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీయాలి. తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు,అరస్పూన్ వాము కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని సెగ గడ్డలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా సెగ గడ్డలు తగ్గుతాయి. మరొక చిట్కా కూడా తెలుసుకుందాం. బియ్యంపిండి కూడా సెగ గడ్డలను తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల బియ్యంపిండి వేసి దానిలో నీటిని కలిపి పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడూ సెగ గడ్డలపై రాసి ఆరాక శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు బాగా పనిచేస్తాయి. మీకు వీలును బట్టి ఈ రెండు చిట్కాలలో ఒకదాన్ని ఫాలో అయినా సరిపోతుంది. వేసవి కాలంలో సెగ గడ్డలు అనేవి సాదరణంగా వస్తూనే ఉంటాయి. ఇలా ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

