పార్లర్ తో పనిలేదు.. ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ కు చెక్ పెట్టండి!
How to remove black heads in telugu : అద్దంలో చూసుకున్నప్పుడు ముక్కు మీద, గడ్డం దగ్గర నల్లగా కనిపించే బ్లాక్ హెడ్స్ ఎంత విసుగు తెప్పిస్తాయో కదా! వీటిని పోగొట్టుకోవడానికి వేళ్ళతో గట్టిగా నొక్కి ముఖం మీద రంధ్రాలు, మచ్చలు చేసుకుంటున్నారా? అయితే ఇకపై ఆ తప్పు అస్సలు చేయకండి.
బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వందలు ఖర్చు చేయకుండా, అసలు నొప్పి లేకుండా ఇంట్లోనే సులువుగా బ్లాక్ హెడ్స్‌ను వదిలించుకునే అద్భుతమైన న్యాచురల్ చిట్కాలను ఈ పోస్ట్‌లో మీకోసం పంచుకుంటున్నాను. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. మీ ముఖం ఎంతో క్లియర్‌గా, మృదువుగా మారుతుంది.

ఈ మధ్య కాలంలో అమ్మాయిలు,అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ వంటి వాటితో బాధపడుతున్నారు. వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనపడుతుంది. ఇవి సాదరణంగా గడ్డం మీద, ముక్కు చుట్టూ ,ముక్కు మీద వస్తాయి. వీటి కారణంగా ముఖం జిడ్డుగా,డల్ గా మారిపోతుంది.
దీని కోసం ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో పావు చెక్క నిమ్మరసం,కొంచెం టూత్ పేస్ట్, పసుపు వేసి బాగా కలపాలి.
బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశాన్ని వేడి నీటిలో ముంచిన కాటన్ క్లాత్ తో తుడిచి 5 నిమిషాల పాటు ఆవిరి పెట్టాలి. ఇలా ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలలో ఉన్న మురికి, దుమ్ము,ధూళి శుభ్రం అవుతుంది. ఆ తర్వాత తయారుచేసుకున్న పుదీనా పేస్ట్ లో నిమ్మచెక్కను ముంచి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో ఐదు నిమిషాలు స్క్రబ్బింగ్ చేయాలి.
ఆ తర్వాత పేస్ట్ ని ఆ ప్రదేశంలో రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్నచోట కొంచెం గట్టిగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ త్వరగా పోతాయి. ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం వస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

