Healthhealth tips in telugu

రోజూ ఈ 1 గ్లాసు తాగితే చాలు.. బరువు, ఒంట్లో వేడి చిటికెలో మాయం!

weight Loss Drink in Telugu :రోజూ ఈ 1 గ్లాసు తాగితే చాలు.. బరువు, ఒంట్లో వేడి చిటికెలో మాయం.. అధిక బరువు సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినపడుతుంది.

వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. ఒక్కసారిగా బరువు తగ్గిపోకూడదు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.
Weight Loss tips in telugu
నల్ల జీలకర్ర,మెంతులు రెండు సమాన పరిమాణంలో తీసుకొని పాన్ లో వేసి వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి.

ఈ డ్రింక్ ని పది రోజుల పాటు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. మెంతులు తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటిస్ కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ డ్రింక్ తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం లేదా యోగా తప్పనిసరిగా చేయాలి.

ఎప్పుడైనా మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కన్నా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో ఇలా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించుకొని ఆదిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."