Healthhealth tips in telugu

Fenugreek Seeds With Curd:పెరుగు మెంతులు కలిపి తీసుకుంటే ఈ రోగాలు దరిచేరవు..

Fenugreek Seeds With Curd:పెరుగు మెంతులు కలిపి తీసుకుంటే ఈ రోగాలు దరిచేరవు.. మెంతులు,పెరుగు రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని విడిగా కాకుండా కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. పెరుగు విషయానికి వస్తే పెరుగులో ఉండే ఖనిజాలు, విటమిన్స్,ప్రోటీన్ లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతులను కలిపి అరగంట అయ్యాక తినవచ్చు. లేదా ఒక కప్పు పెరుగులో అరస్పూన్ మెంతి పొడి కలిపి తీసుకోవచ్చు. లేదా రాత్రి సమయంలో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం మెత్తని పేస్ట్ గా చేసి పెరుగులో కలిపి తినవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు ఉదయం పరగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు ఈ విధంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటమే కాకుండా అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్త సరఫరా బాగా సాగి గుండెకు సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.

శరీరంలో వ్యర్ధాలు తొలగిపోతాయి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు పెరుగు, మెంతులు కలిపి తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటివి ఏమి ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."