Healthhealth tips in telugu

ఎర్ర బంగాళాదుంపలను ఎప్పుడైనా చూసారా…ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Red potato benefits In Telugu : మనం సాదరణంగా తెల్లని బంగాళాదుంపలను వాడుతూ ఉంటాం. అయితే ఎర్ర బంగాళాదుంపలు కూడా లభ్యం అవుతున్నాయి. ఎర్ర బంగాళాదుంపలలో ఉన్న పోషకాలు,ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఎర్ర బంగాళాదుంపలో B6 సమృద్దిగా ఉండుట వలన నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఒత్తిడి,డిప్రెషన్ వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది.ఈ దుంప ఎక్కువ శక్తిని అందించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను కలిగి ఉండుట వలన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఎర్ర బంగాళాదుంపలో ఉండే ఫైబర్ రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ అణువులను కూడా నియంత్రణ చేస్తుంది.
blood
రక్త నాళాల లోపల ఒత్తిడిని తగ్గిస్తుంది, ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. అలాగే శరీరంలోని కణాలు, నరాలు మరియు శరీర ద్రవాలను ఆరోగ్యంగా ఉంచడానికి పొటాషియం అవసరం. చెడు కొలెస్ట్రాల్ లేకుండా మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ దుంపలో టమోటా కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.
Immunity foods
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచటమే కాకుండా శరీర కణజాలాన్ని సరిచేయడానికి సహాయపడుతుంది. ఎర్ర బంగాళాదుంపలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో తీసుకొనే ఆహారం మోతాదు తగ్గి తొందరగా బరువు తగ్గే అవకాశం ఉంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా నాడీ వ్యవస్థ అభివృద్ధికి మరియు కణాల పనితీరు మెరుగుదలకు సహాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణం అవ్వటమే కాకుండా కార్బోహైడ్రేట్‌లను శక్తి వనరుగా మారుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.