Beauty TipsHealthhealth tips in telugu

ఖరీదైన క్రీములు వద్దు.. కాలి పగుళ్లను సహజంగా తగ్గించే పవర్‌ఫుల్ చిట్కా ఇదే!

Cracked heels In Telugu : నడిచేటప్పుడు నొప్పి, బయటకు వెళ్లాలంటే ఇబ్బంది.. కాలి పగుళ్ల (Cracked Heels) సమస్య మిమ్మల్ని కూడా వేధిస్తోందా? మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు లేకుండా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఒక అద్భుతమైన చిట్కాతో పగిలిన మడమలను శాశ్వతంగా ఎలా మృదువుగా మార్చుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

పగిలిన మడమలు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాకుండా, నొప్పిని కూడా కలుగ చేస్తుంటాయి. ఒక్కోసారి నొప్పి, బాధ ఎక్కువగా ఉంటాయి. పొడి చర్మం వలన పగిలిన మడమలు ఇతర చర్మ సమస్యలను కలిగిస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

పాదాలు పొడిగా ఉండటం మరియు ఒత్తిడికి గురవటం వలన పాదాలు పగుళ్ళకు లోనవుతాయి. సరైన విధంగా చికిత్స చేయకపోతే రక్త స్రావాలకు లోనవుతాయి. కావున వీలైనంత త్వరగా తగిన చికిత్సను అందించటం మంచిది.అశ్రద్ధ చేయకూడదు. పగిలిన మడిమలకు చాలా మంది, మార్కెట్ లో లభించే ఇంగ్లిష్ మందులను వాడతారు.

వీటి వలన ఫలితం ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది . ఇంటిలో దొరికే సహజసిద్ధమైన పదార్ధాలు అయితే వాటికీ సహజంగా తేమను అందించి శాశ్వతంగా తగ్గిస్తాయి. ఇప్పుడు ఆ చిట్కాకు ఏమి అవసరం అవుతాయి. అలాగే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ లో ఒక స్పూన్ బియ్యం పిండిని తీసుకోవాలి.

ఆ తర్వాత అర స్పూన్ తేనె, ఒక స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్ వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాదాలను గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి…శుభ్రంగా పాదాలను తుడిచి…తయారుచేసి పెట్టుకున్న పేస్ట్ రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక పాదాలను శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తగ్గి పాదాలు మృదువుగా మారతాయి. పాదాల పగుళ్ళ కోసం ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంటిలో ఇలా సహజసిద్దంగా తయారుచేసుకున్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."