Healthhealth tips in telugu

High blood pressure:హైబీపీ ఉన్నవారు మిరియాలను తీసుకుంటే ఏమి అవుతుందో తెలుసా ?

Black pepper eating benefits for high blood pressure : కొన్ని ఆహారాలను తీసుకుంటే కొన్ని సమస్యలకు కొంత ఉపశమనం కలుగుతుంది. మిరియాలను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అధిక రక్తపోటు ఉన్నవారు మిరియాలు తీసుకుంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు జీవితకాలం మందులు వాడాలి. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రక్తపోటు మీద ఆహారం ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది.

రక్తపోటు అనేది ఈ మధ్య కాలంలో 100 మందిలో 40 మందికి కనపడుతుంది. మన వంటింటిలో ఉండే మిరియాలు రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. కండరాలను మృదువుగా రిలాక్స్ చేయటానికి మిరియాలు చాలా బాగా సహాయపడతాయి. ప్రతి రోజు రెండు గ్రాముల మిరియాల పొడిని తీసుకోవాలి.

మిరియాలలో పెప్పరిన్ అనే కెమికల్ కాంపౌండ్ కండరాలను మృదువుగా రిలాక్స్ చేస్తుంది. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు లేకుండా చేసి రక్తప్రవాహం సాఫీగా జరిగేలా చేస్తుంది. మిరియాలను దోరగా వేగించి మెత్తని పొడిగా చేసుకొని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు రెండు గ్రాముల మోతాదులో వాడాలి.
blood thinning
ఈ పొడిని సలాడ్స్ మీద జల్లుకోవచ్చు…మొలకలు,కూరల్లో కలుపుకొని తినవచ్చు…లేదంటే అన్నంలో కలుపుకొని తినవచ్చు. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని బాగా తగ్గించాలి. అంతేకాకుండా ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి.
blood
శారీరక శ్రమ అనేది గుండెను బలపరచి తక్కువ శ్రమతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. గుండె పంప్ చేయడానికి శ్రమ తగ్గితే…ధమనులపై శక్తి తగ్గి రక్తపోటును తగ్గిస్తుంది.మరింత చురుకుగా మారడం వలన సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది. సిస్టోలిక్ రక్తపోటు అనేది గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."