Healthhealth tips in telugu

పాలు తాగకపోయినా పర్లేదు.. ఈ ఆహారాలు తింటే జీవితంలో కాల్షియం లోపం రాదు!

Calcium Rich Food In Telugu : కాల్షియం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పాలు మాత్రమే. కానీ పాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం అందించే అద్భుతమైన ఆహార పదార్థాలు మన చుట్టూనే ఉన్నాయి.

వీటిని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా, జీవితంలో కాల్షియం లోపం, మోకాళ్ల నొప్పులు అనేవి దరిచేరవు. పాలకి ప్రత్యామ్నాయంగా పనిచేసే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

కాల్షియం మన శరీరానికి సమృద్దిగా అందాలంటే మనలో చాలా మంది పాలను తాగితే సరిపోతుందని భావిస్తారు. అయితే పాలల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహారాలు చాలానే ఉన్నాయి. అలాగే కొంతమందికి పాలు తాగితే ఎలర్జీ వస్తుంది. అటువంటి వారికి ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే కాల్షియం లోపం లేకుండా చేస్తాయి.

ఎముకలు దృఢంగా ఉండాలంటే శరీరానికి కాల్షియం అవసరం. కాల్షియం, విటమిన్ డితో కలిసి క్యాన్సర్, మధుమేహం మరియు అధిక రక్తపోటు నుండి కూడా రక్షించడంలో సహాయపడుతుంది. ఎముకలు మరియు దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అవసరం. అందువల్ల కాల్షియం అనేది శరీరంలో తగినంత పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.

అసలు మన శరీరానికి రోజుకి ఎంత కాల్షియం అవసరం అవుతుందో చూద్దాం. 19-50 సంవత్సరాల వయస్సు ఉన్న పెద్దవారికి రోజుకు 2,500 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. 51 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి రోజుకు 2,000 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం అవుతుంది.

తోటకూరలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రస్తుతం ఆకుకూరలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ఎముకలు బలహీనంగా లేకుండా బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. వారంలో రెండు సార్లు తోటకూరను ఆహారంలో బాగంగా చేసుకోవాలి. ఎముకలు ఏర్పడటానికి మరియు అభివృద్ధికి కాల్షియం చాలా ముఖ్యమైనది.

అంజీర్ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో కాల్షియంతో పాటు ఫైబర్స్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో రెండు అంజీర్ లను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన అంజీర్ ని నీటితో సహ తినాలి. ఇలా అంజీర్ తినటం వలన కాల్షియం లోపం తగ్గటమే కాకుండా రక్తహీనత సమస్య కూడా ఉండదు.

నువ్వులలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ప్రతి రోజు ఒక స్పూన్ నువ్వులను ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది. నువ్వులు,బెల్లం కలిపి కూడా తీసుకోవచ్చు. నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినవచ్చు.

ఒట్స్ లో కూడా కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఒట్స్ ని వారంలో రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఒట్స్ లో కాల్షియం మరియు ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. వీటిని తీసుకుంటే కాల్షియం లోపం తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడవచ్చు. కార్న్ ఫ్లేక్స్ కంటే ఒట్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."