Healthhealth tips in telugu

కేవలం 15 రోజులు.. రోజూ ఈ ఒక్క గ్లాస్ డ్రింక్ తాగితే మంచులా కరిగే కొవ్వు, అమాంతం పెరిగే ఎనర్జీ!

Weight Loss Milk in telugu : బరువు తగ్గాలని కఠినమైన డైటింగ్ చేసి నీరసపడిపోతున్నారా? అయితే ఈ పవర్ఫుల్ డ్రింక్ మీకోసమే. కేవలం 15 రోజుల పాటు రోజూ ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగితే చాలు..

శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు మంచులా కరగడమే కాకుండా, రోజంతా ఎలాంటి అలసట, నీరసం లేకుండా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. బరువును తగ్గించి ఎనర్జీని పెంచే ఆ అద్భుతమైన పానీయం ఏంటి? దాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వక తీవ్రమైన నిరాశకు గురవుతూ ఉంటారు. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే నెల రోజుల్లో బరువు తగ్గడం గమనించి చాలా ఆశ్చర్యపోతారు.
Weight Loss tips in telugu
బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన రీతిలో జరగాలి. ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ నువ్వులను దోరగా వేగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని మనం ఎక్కువగా తయారుచేసుకుని కూడా నిలువ చేసుకోవచ్చు. మిక్సీ జార్ లో అవిసే గింజలు, నువ్వుల పొడి వేయాలి.

ఆ తర్వాత నాలుగు ఎండు ద్రాక్షలు వేయాలి. ఆ తర్వాత గింజ తీసిన ఖర్జూరాలు మూడు వేయాలి. పావు స్పూన్ యాలకుల పొడి, ఒక గ్లాసు పాలు, మూడు వాల్ నట్స్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ పాలను ఉదయం సమయంలో తీసుకుంటే నీరసం, అలసట, నిస్సత్తువ వంటివి ఏమీ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమీ రావు. ఈ పాలల్లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి మరియు నీరసం లేకుండా ఉషారుగా ఉండటానికి సహాయపడుతుంది.

అలాగే కీళ్ల నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు కూడా ఈ పాలను తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ పాలను నెల రోజుల పాటు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."