Healthhealth tips in telugu

ఉదయాన్నే పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బలు తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే!

Raw Garlic Benefits In Telugu : మన వంటింట్లో సులభంగా దొరికే పోషకాల గని వెల్లుల్లి. కేవలం వంటల రుచి పెంచడానికే కాకుండా, ఆయుర్వేదంలో దీనిని ఒక దివ్య ఔషధంగా వాడుతుంటారు. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగడం లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని లాభాలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.

అయితే పచ్చి వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కదా, పరగడుపున నిజంగా తినొచ్చా? దీనివల్ల బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయా? గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఎలా తీసుకోవాలి? వంటి ఎన్నో అనుమానాలు మనకు వస్తుంటాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, దానిని తినే సరైన పద్ధతి మరియు ఎవరెవరు తీసుకోకూడదో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

వెల్లుల్లి వంటలకు మంచి రుచి, వాసనను అందిస్తుంది. ఆయుర్వేదంలో పురాతన కాలం నుండి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా వెల్లుల్లిని ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి.ని ఏ రూపంలో తీసుకున్న మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వెల్లుల్లి వాసన కారణంగా మనలో చాలా మంది తినటానికి ఆసక్తి చూపరు. .
garlic Health benefits
అయితే ఉదయం సమయంలో రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని ఒక గ్లాసు మంచి నీటిని తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తపోటు సమస్య ఉన్నవారు ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలను తిని మంచి నీటిని తాగితే గుండెకు రక్తప్రసరణ బాగా సాగుతుంది.

అలాగే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ క్లాటింగ్ గుణాలు రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతాయి. వెల్లుల్లిలో ఉండే సమ్మేళనాలు కాలేయంలో విషాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుదలకు సహాయ పడుతుంది. ఈ రోజుల్లో మారిన జీవన శైలి కారణంగా ఒత్తిడి విపరీతంగా ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోయింది.

వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అధిక బరువు, శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటంలో చాలా సమర్ధవంతంగా వెల్లుల్లి పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. వెల్లుల్లిలో ఉన్న ప్రయోజనాలు అన్ని మన శరీరానికి అందాలంటే వెల్లుల్లి పచ్చిగానే తినాలి.

అయితే గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లి తింటే గ్యాస్ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి వెల్లుల్లిని ఉడికించి తీసుకోవచ్చు…లేదంటే వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో మరిగించి, ఉడికిన వెల్లుల్లి ముక్కలను తింటూ నీటిని తాగితే మంచి ప్రయోజనం కనబడుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."