Healthhealth tips in telugu

రామ తులసి, కృష్ణ తులసిలో ఏ ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది? ఈ నమ్మలేని నిజాలు మీకోసం!

Rama Tulasi And Krishna Tulasi benefits : హిందూ సంప్రదాయంలోనూ, ఆయుర్వేదంలోనూ తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే మన ఇళ్లలో సాధారణంగా పెంచుకునే రామ తులసి, కృష్ణ తులసి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏంటి? ఈ రెండింటిలో ఏ తులసి ఆకులు తింటే మన ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

తులసిని మనం ప్రతి రోజు పూజిస్తాము. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆరోగ్య పరంగా తులసిని ఎక్కువగా వాడుతున్నారు. తులసిలో ఎన్నో రకాలు ఉన్నప్పటికి…కృష్ణ తులసి,రామ తులసి…ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
Tulasi health benefits In telugu
రామ తులసిని పూజా కొరకు మరియు ఔషధ గుణాలకు చాలా ప్రసిద్ది చెందింది. ఈ తులసి ఆకులు ఇతర రకాల తులసి కంటే తియ్యని రుచిని కలిగి ఉంటాయి. ఇక కృష్ణ తులసి విషయానికి వస్తే ముదురు ఆకుపచ్చ/ఊదా రంగు ఆకులు మరియు ఊదా రంగు కాండం కలిగి ఉంటుంది. ఇది కొంచెం చేదు రుచిని కలిగి ఉంటుంది.

రెండు రకాల తులసి ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే రామ తులసి జీర్ణ సమస్యలను తగ్గించి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒత్తిడి,ఆందోళన వంటి వాటి ఉపశమనం కొరకు సహాయపడుతుంది. క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.

కృష్ణ తులసి శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరం, జలుబు మరియు దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు గుండె ఆరోగ్యానికి మరియు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేస్తుంది మరియు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది.

రామ తులసి,కృష్ణ తులసి రెండూ కూడా మన ఆరోగ్యానికి మంచిది. రోజుకి మూడు ఆకులను పరగడుపున నమిలి తినవచ్చు…లేదంటే తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. తులసి అనేది దాదాపుగా ప్రతి ఇంటిలో ఉంటుంది కాబట్టి తులసి ఆకులను తిని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."