Healthhealth tips in telugu

1 స్పూన్ కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరిగి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి

Joint Pains Home remedies In telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మారిన జీవనశైలి, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం మరియు వ్యాయామం చేయకపోవటం, అధిక బరువు వంటి అనేక రకాల కారణాలతో కీళ్ల నొప్పులు వస్తున్నాయి.
Joint Pains
కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు నాలుగు అడుగులు వేయాలంటే విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే కూర్చొని లేగాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చెప్పే ఈ రెమిడీ ఫాలో అయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మిక్సీ జార్ లో 5 స్పూన్ల గుమ్మడి గింజలను వేయాలి. గుమ్మడి గింజలలో ఉండే జింక్ ఎముకలకు చాలా మంచిది.
gummadi ginjalu benefits in telugu
అలాగే ఫాస్ఫరస్ అనేది కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఆ తర్వాత 4 స్పూన్ల ఎండు ద్రాక్షను శుభ్రంగా కడిగి ఆరబెట్టి మిక్సీ జార్ లో వేయాలి. ఎండు ద్రాక్షలో ఉన్న లక్షణాలు శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అలాగే ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇమ్యునోస్టిమ్యులేటింగ్ మరియు మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

మిక్సీ జార్ లో వేసిన గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్షలను మెత్తగా చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్ల ఆవిసే గింజలను మెత్తని పొడిగా చేసుకోవాలి. అవిసె గింజల్లో బి విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్పరస్ కూడా పుష్కలంగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
Flax seeds
ఆవిసే గింజలు మృదులాస్థి మరియు ఎముకలకు మంచిది. గుమ్మడి గింజలు,ఎండు ద్రాక్ష మిశ్రమంలో ఆవిసే గింజల పొడి, 5 స్పూన్ల తేనె వేసి బాగా కలిపి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి.
Honey benefits in telugu
తేనెలో విటమిన్ B, K, E, C, A వంటివి సమృద్దిగా ఉంటాయి. తేనె రక్తపోటును తగ్గిస్తుంది మరియు హృదయ స్పందన హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. గ్యాస్,ఎసిడిటీని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మరియు పోషకాల శోషణను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు తీసుకొని నొప్పుల నుండి ఉపశమనం పొందండి. కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరిగి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.