Healthhealth tips in telugu

కాకరకాయ టీ తాగితే… ఊహించని లాభాలు ఎన్నో…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…

Bitter gourd tea benefits In telugu : మనలో చాలా మంది కాకరకాయ అంటే ఇష్టపడరు. కాకరకాయలు చేదుగా ఉండడమే అందుకు కారణం. అయితే కాకరకాయ ఎన్నో పోషకాలను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కాకరకాయ తినని వారు కాకరకాయతో టీ తయారు చేసుకుని తాగితే సరిపోతుంది.

ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాకరకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఈ ఎండిన కాకరకాయ ముక్కలను నిలవ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీటిని పోసి కొన్ని ఎండిన కాకరకాయ ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని వడగట్టి ఒక స్పూన్ నిమ్మరసం., ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.
Diabetes diet in telugu
డయాబెటిస్ ఉన్నవారు మాత్రం తేనే వాడకూడదు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. శరీరంలోని విషాలను తొలగించి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. .

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రాణాంతక క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుంది. కాకరకాయ టీ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో మరియు ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతేకాక అజీర్తిని కూడా దూరం చేస్తుంది.
eye sight remedies
విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుపడటమే కాకుండా కంటికి సంబందించిన సమస్యలు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాకరలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మరియు A మరియు C వంటి విటమిన్లు ఉంటాయి. ఇందులో పాలకూర కంటే రెండు రెట్లు కాల్షియం మరియు బ్రోకలీలోని బీటా-కెరోటిన్ ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.