Healthhealth tips in telugu

జిమ్, డైట్ లేకుండా స్పీడ్‌గా సన్నబడాలంటే.. ఎవరికీ తెలియని ఈ ట్రిక్ ఫాలో అవ్వండి!

Weight Loss Drink In Telugu Dalchina Chekka :ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం.ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది.

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక నిమిషం మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక దించి వడకట్టాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పు తాగాలి.

ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ తాగాక 40 నిమిషాల వరకు ఏమీ తినకూడదు తాగకూడదు. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ డ్రింక్ తాగాలి. ఈ డ్రింక్ ని ఐదు రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఐదు రోజులు తాగాలి.
Ginger benefits in telugu
ఈ విధంగా డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది. మిరియాల, దాల్చిన చెక్క, అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి. దాంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
weight loss tips in telugu
అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేడి శరీరం ఉన్నవారు రోజుకి ఒకసారి మాత్రమే తాగాలి. ఎందుకంటే పైన చెప్పిన పదార్థాలన్నీ వేడి చేసే పదార్ధాలు. వేడి శరీరం ఉన్నవారు ఈ డ్రింక్ తాగినప్పుడు ఏమైనా అసౌకర్యం ఉంటే డ్రింక్ తాగడం మానేయాలి.. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."