1 స్పూన్ తింటే మెదడు ఆరోగ్యంగా,ఎముకలు బలంగా…ముఖ్యంగా ఈ సీజన్ లో..
Just eat 1 tsp daily in winters : ఈ చలికాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రతి రోజు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే ఈ సీజన్ లో వచ్చే సమస్యలు రావు.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి అరకప్పు ఎండు కొబ్బరి వేసి మంచి వాసన వచ్చే వరకు వెగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో అరకప్పు నెయ్యి వేసి కాస్త కరిగాక అరకప్పు Edible Gum వేసి Gold కలర్ వచ్చే వరకు వేగించి మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ లో అరకప్పు బాదం పప్పు, అరకప్పు జీడిపప్పు,అరకప్పు వాల్ నట్స్, అరకప్పు పుచ్చ గింజలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు పాలను పోసి మిక్సీ చేసిన Edible Gum వేసి రెండు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత మిక్సీ చేసిన Dry Fruits పొడి వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత ఒక కప్పు Brown Suger లేదా ఆర్గానిక్ బెల్లం పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ NutMeg పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి. అరస్పూన్ శొంఠి పొడి కూడా వేసి కలపాలి.

రెండు స్పూన్ల నెయ్యి, వేగించి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసి బాగా కలిపి నెయ్యి సపరేట్ అయ్యేవరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే 8 నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఒక స్పూన్ తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి. మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. చలికాలంలో వచ్చే అన్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

