Beauty TipsHealth

Hair Growth Tips:ఒక స్పూన్ నూనె చుండ్రు, జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది

Hair Growth Tips:ఒక స్పూన్ నూనె చుండ్రు, జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది..వాతావరణంలో కాలుష్యం, జుట్టుకి సరైన సంరక్షణ లేకపోవటం, కెమికల్స్ ఎక్కువగా ఉన్న షాంపూలను వాడటం వలన చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి జుట్టుకి సంబందించిన ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు.
tamalapaku
మన ఇంట్లో తయారు చేసుకున్న నూనెలను వాడితే సరిపోతుంది. చాలా బాగా పనిచేస్తాయి. తక్కువ ఖర్చుతో జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.
Hair Fall Tips in telugu
ఒక పాన్ తీసుకొని రెండు తమలపాకులను చిన్నచిన్న ముక్కలుగా చేసుకుని వేయాలి. ఆ తర్వాత మూడు కరివేపాకు రెబ్బలను ఆకులుగా విడతీసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ కలోంజి విత్తనాలు వేసి దానిలో కొబ్బరి నూనె వేయాలి. వీటన్నింటినీ వేసుకున్నాక ఈ పాన్ ను పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి.
fenugreek seeds
ఈ నూనెను వడగట్టి ప్రతిరోజు తలకు రాసుకుంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ నూనె రాయటం వలన చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. ఈ నూనెను ఒక సారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. అలాగే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టు సంరక్షణలో సహాయపడతాయి. అలాగే ఇవన్నీ మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నూనెను ఉపయోగించి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడవచ్చు. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u