Bay leaves Vs Curry leaves:బిర్యానీ ఆకు Vs కరివేపాకు… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది… నమ్మలేని నిజాలు
Bay leaves Vs Curry leaves:బిర్యానీ ఆకు Vs కరివేపాకు… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది… నమ్మలేని నిజాలు..మనం ప్రతి రోజు ఉపయోగించే ఆహార పదార్ధాలలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కరివేపాకు,బిర్యానీ ఆకులలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది తింటే మంచిదో తెలుసుకుందాం.
బిర్యానీ ఆకును ఎక్కువగా మసాలా వంటలలో ఉపయోగిస్తారు. అలాగే కరివేపాకుకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. కరివేపాకు బిర్యానీ ఆకుతో పోలిస్తే చిన్నగా ఉంటుంది. కరివేపాకును తాజాగా ఉపయోగిస్తారు. బిర్యానీ ఆకును ఎండిన ఆకును ఉపయోగిస్తారు. కరివేపాకు,బిర్యానీ ఆకు రుచిలో విబిన్నంగా ఉంటాయి. వంటలలో బిర్యానీ ఆకులను వేసినప్పుడు తినేటప్పుడు తీసివేస్తాం. అదే కరివేపాకు అయితే పాడేయకుండా తింటాము.
కరివేపాకు కొద్దిగా సిట్రస్ సువాసన మరియు ప్రత్యేకమైన ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. వాటిని తరచుగా లెమన్‌గ్రాస్‌తో పోల్చుతారు. బిర్యానీ ఆకులు థైమ్ మరియు ఒరేగానో వంటి మూలికా మరియు పూల సువాసనను కలిగి ఉంటాయి. కరివేపాకు,బిర్యానీ ఆకు రెండూ కూడా వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.
కరివేపాకులో విటమిన్ ఎ, బి, సి మరియు బి2,ఐరన్,కాల్షియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. మరియు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బిర్యానీ ఆకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో సహాయ పడుతుంది.జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండూ కూడా .ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. బిర్యానీ ఆకుతో పోలిస్తే కరివేపాకును ప్రతి రోజు తీసుకోవచ్చు. బిర్యానీ ఆకు తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u