MoviesTollywood news in telugu

NTR ‘ఊపిరి’ సినిమాని రిజెక్ట్ చేయటానికి కారణం ఏమిటి?

Nagarjuna Oopiri Movie : ప్రతి అభిమాని తమ అభిమాన నటుని గురించి ఏదైనా విషయం తెలుస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టారర్ సినిమా ” ఊపిరి” ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే.

ఈ సినిమా క్లాస్,మాస్ ఆడియన్స్ అందరికి చేరువ అయింది. ఈ సినిమాలో నాగార్జున మరియు కార్తి పోటీ పడి మరీ నటించారు. నాగార్జున వీల్ చైర్ కి పరిమితం అయిన కోటిశ్వరుని పాత్రలో,దొంగతనాలు చేసి డబ్బును తొందరగా సంపాదించాలనుకొనే దొంగ పాత్రలో కార్తి నటించారు.

ఈ సినిమాలో మొదట కార్తి స్థానంలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి భావించాడు. దాంతో యంగ్ టైగర్ ని కలిసి కథను కూడా వినిపించాడు. కథ కూడా ఎన్టీఆర్ కి నచ్చింది. ఇంకా షూటింగ్ తరువాయి అనే సమయంలో ఈ ప్రాజెక్ట్ నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి.

కారణం ఏమిటా అని అరా తీస్తే ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది. ఈ సినిమాలో నాగార్జున కాళ్ళకు కార్తి సాక్స్ వేసే సన్నివేసం ఉంది. ఆ సన్నివేశాన్ని ఎన్టీఆర్ చేస్తే కనుక ఎన్టీఆర్ అభిమానులు హార్ట్ అవుతారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సైలెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."