MoviesTollywood news in telugu

Tollywood లో బాగా చదువుకున్న హీరోలు ఎవరో తెలుసా?

Tollywood star heroes education details : హీరోలకు సంబందించిన ప్రతి విషయాన్నీ తెలుసుకోవటానికి ప్రతి అభిమాని సిద్దంగా ఉంటాడు. సినిమా హీరోలు అనగానే వీరికి చదువు అబ్బక ఇండస్ట్రీ లోకి వచ్చి సినిమాలు చేస్తున్నారు.. అని అందరూ అనుకునే మాటే కానీ మన తెలుగు హీరోలు చదువుకున్న చదువుల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.

నందమూరి కళ్యాణ్ రామ్
కళ్యాణ్ తన గ్రాడ్యుయేషన్ ని బిట్స్ పిలాని నుండి పొందారు. తరువాత అమెరికా యూనివర్సిటీలో ఎం.బి.ఏ చేశారు .

అవసరాల శ్రీనివాస్
అవసరాల శ్రీనివాస్ అమెరికా లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసాడు.

వెంకటేష్
వెంకటేష్ గారు హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసి అమెరికా లో ఎం.బి.ఏ చేశారు.

అక్కినేని నాగార్జున
నాగార్జున చెన్నై లో ఇంజనీరింగ్ చేసి , అమెరికా లో ఆటోమొబైల్ ఇంజినీర్ లో మాస్టర్స్ చేశారు.

సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ బయో టెక్నాలోజి లో మన దేశం లోని టాప్ యూనివర్సిటీ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ (IIPM) ఎం.బి.ఏ ని పూర్తి చేసాడు.

రాజ శేఖర్
M.B.B.S చదివి కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీస్ చేసాడు.

రామ్ చరణ్
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డిగ్రీ పొందాడు.

అల్లు arjun
అల్లు అరవింద్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అల్లు arjun బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

జూనియర్ NTR
జూనియర్ NTR హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పాసయ్యాడు.