Cold And Cough:ఈ డ్రింక్‌ను తాగితే ఎంత తీవ్రమైన దగ్గు అయినా నిమిషంలో తగ్గిపోతుంది
Cold And Cough Home remedies in telugu : ఈ సీజన్లో అంటే చలికాలంలో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్యలలో దగ్గు ముఖ్యమైనది. దగ్గు వచ్చినప్పుడు తొందరగా తగ్గదు. దగ్గుకి మందులు ఎన్ని వాడినా తొందరగా ఉపశమనం రాదు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లో తయారు చేసుకునే ఒక సింపుల్ చిట్కాతో ఎంత తీవ్రమైన దగ్గు నైనా తగ్గించుకోవచ్చు.

కాస్త ఓపిక ఈ డ్రింక్ తయారు చేసుకొని తాగితే చాలా తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ సీజన్ లో వచ్చే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోయాలి. ఆ నీరు కాస్త వేడి అయ్యాక గుప్పెడు మెంతి ఆకులు, ఆరు తులసి ఆకులు, అర స్పూన్ సోంపు, రెండు దంచిన యాలకులను వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఈ మరిగిన నీటిని వడగట్టి ఒక స్పూన్ అల్లం రసం కలపాలి. ఈ డ్రింక్ ని ఆర గ్లాసు మోతాదులో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాబట్టి ఈ డ్రింక్ ని తయారుచేసుకొని తాగి సీజనల్ సమస్యల నుండి బయట పడండి. ఈ డ్రింక్ లో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు శ్వాస సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. అలాగే ఇవన్నీ మన వంటింటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

