MoviesTollywood news in telugu

Mahesh Babu పోకిరి సినిమా మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా ?

Mahesh Babu pokiri Movie: మహేష్ బాబు పోకిరి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్‌లో ఎక్కువ వివాదాలు క్రియేట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే అందాల భామ కంగనా రనౌత్, తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

ఈ బ్యూటీ తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఏక్‌నిరంజన్ చిత్రంలో నటించింది.అయితే ఈ సినిమా కంటే ముందే ఆమె తెలుగు సినిమా చేయాల్సిందట. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన పోకిరి సినిమాలో హీరోయిన్‌గా తొలుత కంగనా ఎంపికయ్యిందట. అయితే అదే సమయంలో బాలీవుడ్‌లో గ్యాంగ్‌స్టర్ చిత్రంలో కూడా సెలెక్ట్ కావడంతో పోకిరి సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.

ఇలా తెలుగు బ్లాక్‌బస్టర్ మూవీని వదులుకున్నందుకు ఆమె చాలాసార్లు బాధపడిందట. అయితే ఏక్‌నిరంజన్ చిత్రం ఫెయిల్యూర్‌గా మిగలడంతో ఆమె చాలా నిరాశకు లోనై, ఆ తరువాత తెలుగులో నటించలేదని తెలిపింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."