MoviesTollywood news in telugu

ఈ అందాల ముద్దుగుమ్మను గుర్తు పట్టారా… స్టార్ హీరోయిన్…?

Tollywood Star heroine Samantha : ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అందాల భామ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అదేనండి ‘ఏ మాయ చేసావే’ అంటూ టాలివుడ్ కి వచ్చిన సమంతా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ చెన్నై భామ టాలీవుడ్ కి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించింది. 

సమంతా మదురై లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. ఆమె ముద్దు పేరు సామ్. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. నటించిన మొదటి సినిమాలోనే లిప్ లాక్ కి ఒకే చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగ చైతన్య తో అనేక ముద్దు సన్నివేశాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ భామ సినిమాల్లోకి రాక ముందు చెన్నై లో షాపింగ్ మాల్స్ కి యాడ్స్ చేసేది.

సమంతాకి టాలీవుడ్ లో మహేష్ బాబు,ఎన్టీఆర్ అంటే ఇష్టం అని పలు సార్లు చెప్పింది. మహేష్ బాబు అందం,ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా పిచ్చి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ సినిమాలో నటించే అవకాశం మొదట సమంతా కె వచ్చింది. అయితే కొన్ని అనారోగ్య పరిస్తితుల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవలసి వచ్చింది. అయితే ఈ అవకాశం చేజారినందుకు ఇప్పటికి సమంతా బాధ పడుతుంది.

సమంతా నటించిన మొదటి సినిమాకే నంది అవార్డ్,ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తో సహా అనేక అవార్డ్ పొందింది. తెలుగులో హిట్ కొట్టిన నాలుగు సంవత్సరాలకు తన మాతృ బాష అయిన తమిళంలో హిట్ కొట్టింది. సమంతా లో సేవా గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆమె ప్రత్యూష పౌండేషన్ ఏర్పాటు చేసి తన వంతు సాయాన్ని అందిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."