హై బీపీ ఉన్నవారు ఉల్లిపాయ తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
High Blood Pressure Foods : చాలా చిన్న వయస్సులోనే అనారోగ్యకరమైన జీవనశైలి, అధిక ఒత్తిడి వల్ల వచ్చే ప్రధాన వ్యాధులలో అధిక రక్తపోటు ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే, గుండె సమస్యలు మరియు ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అందుకే రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తపోటు ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
అలా మందులు వాడుతూ రక్తపోటును నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఉల్లిపాయ తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఉల్లిపాయలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు, విటమిన్ సి మరియు సల్ఫర్ సమృద్దిగా ఉంటాయి.
ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది. ఇది శరీరంలో అధిక రక్తపోటును నియంత్రించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే సిరల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి భవిష్యత్తులో గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే ఉల్లిపాయను పచ్చిగా తినాలి.
అధిక రక్తపోటు ఉన్నవారు ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. సోడియం యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించే పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఉల్లిపాయల్లో పొటాషియం చాలా సమృద్దిగా ఉంటుంది. ఉల్లిపాయలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు సమ్మేళనాలు వాపుతో పోరాటం చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
ఉల్లిపాయ రక్తపోటును తగ్గించటమే కాకుండా డయాబెటిస్ నిర్వహణలో కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి రక్తపోటు మరియు డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా ప్రతి రోజు ఒక చిన్న పచ్చి ఉల్లిపాయలో సగం తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.