Beauty TipsHealthhealth tips in telugu

పులిపిర్ల సమస్యకు సింపుల్ పరిష్కారం: డాక్టర్‌తో పనిలేకుండా ఇంటి చిట్కాలతో చెక్!

Warts home remedies in Telugu : పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఎలాంటి ఖర్చు లేకుండా, డాక్టర్ అవసరం లేకుండా ఇంట్లోనే సహజమైన పద్ధతిలో పులిపిర్లను (Skin Tags) శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలో ఈ బ్లాగ్‌లో తెలుసుకోండి.

పులిపిర్లు సమస్యతో బాధపడుతుంటే సులభమైన గృహచిట్కాలతో సమస్యను తగ్గించవచ్చు. పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి.

పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా, శ్రద్దగా చేసుకుంటే తక్కువ ఖర్చులోనే మంచి పలితాలను పొందవచ్చు.

పసుపు,సున్నం,(తాంబూలంలో వేసుకొనే సున్నం) వంటసోడా మూడింటిని సమాన బాగాలుగా తీసుకొని నీటిని పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని టూత్ పిక్ సాయంతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట అయ్యాక శుభ్రం చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పులిపిర్లు రాలిపోతాయి.

అలాగే రాత్రి సమయంలో ఒక స్పూన్ అవునెయ్యిలో చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలిపి తీసుకోవాలి. రాత్రి సమయంలో రాగి పాత్రలో నీటిని పోసి 6 తులసి ఆకులను వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ తులసి ఆకులను నములుతూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

రోగనిరోదక శక్తి తగ్గినప్పుడు పులిపిర్లు వస్తాయి. ఇప్పుడు చెప్పిన మూడు చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ సమయంలోనే పులిపిర్లు రాలిపోతాయి. దీని కోసం ఖరీదైన మందులు వాడవలసిన అవసరం లేదు. ఇలా చేసిన తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. ఏ ఆరోగ్య సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."