Beauty TipsHealthhealth tips in telugu

పసుపులో ఇది కలిపి ముఖానికి రాస్తే చాలు.. కేవలం 5 నిమిషాల్లో మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!

Turmeric and coffee Face Glow Tips In Telugu : ముఖంపై ఉన్న నలుపు, మచ్చలు, ట్యాన్ (Tan) తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారాలంటే పసుపుతో చేసే ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం 5 నిమిషాల్లో ముఖం అందంగా, మృదువుగా మారడానికి పసుపులో ఏ పదార్థం కలిపి రాయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. మనలో చాలా మంది ముఖం అందంగా, కాంతి వంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్దీ డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా అది తాత్కాలికమే.

ఆలా కాకుండా మన ఇంటిలో దొరికే వస్తువులతో ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా మెరవటమే కాకుండా ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతుంది. సాదరణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి రకరకాల facials చేయించు కుంటాం. ఆలా చేయించుకుంటే ముఖం అందంగా మెరిసిపోతూ ఉంటుందని భావిస్తాం.

అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా,ప్రకాశవంతంగా మారుతుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ పసుపు, కొంచెం నీటిని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. పసుపు జిడ్డు చర్మం,పొడి చర్మం ఇలా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. ముఖం కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది. పంచదార ఎక్స్ ఫ్లోయిట్ గా పనిచేసి చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది.

కాఫీలో ఉండే కెఫీన్ మృత కణాలు,చర్మంపై మలినాలను తొలగించి ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మంచి పలితాలను పొందవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు చర్మానికి పోషణ అందిస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."