MoviesTollywood news in telugu

Venkatesh వదిలేసిన సినిమాలు ఇవే.. అందులో 4 బ్లాక్‌బస్టర్స్..

Venkatesh rejected movies in Telugu : Venkatesh కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు. వాటిలో కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు కొందరి కోసమే ఉంటాయి. అందుకే ఛాన్స్ వచ్చినా దూరంగా వెళ్లి, చేరాల్సిన చోటకి చేరతాయి. ఇలా పలువురి హీరోల విషయంలో జరుగుతూ ఉంటుంది. ఇక విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా చాలా సినిమాలు వదిలేసుకున్నవి ఉన్నాయి.

ప్రభు, కార్తీక లతో మణిరత్నం ఘర్షణ సినిమా తీసి హిట్ కొట్టాడు. అయితే తెలుగులో అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న వెంకటేష్,నాగార్జునతో ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ వాళ్లు నో చెప్పేసరికి ఈ సినిమా కాస్తా వెంకీ చేతుల్లోంచి జారిపోయింది. అయితే ఘర్షణ అప్పుడు మిస్ అయినా అదే పేరుతో తర్వాత వెంకటేష్ సినిమా చేయడం విశేషం.

అంతేకాదు, అలా వెంకటేష్ దగ్గరికి వచ్చిన రోజా కథను కూడా మణిరత్నం తీసుకెళ్లి వినిపించాడు. అయితే తెలుగులో చంటి లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నందున వెంకటేష్ దీన్ని కూడా రిజెక్ట్ చేయడంతో అరవింద్ స్వామి చేసి హిట్ అందు కున్నాడు.

ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా కూడా వెంకీ దగ్గరకే వచ్చింది. అయితే కలిసుందాం రా సినిమాతో బిజీగా ఉండటం వలన కాదనడంతో ఆ తర్వాత అదే కథను మరో ఇద్దరు హీరోల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా వద్దనడంతో చివరకు అర్జున్ తో తీసి శంకర్ బ్లాక్ బస్టర్ కొట్టాడు.కుటుంబ కథా చిత్రాలు చేయాలంటే ఒకప్పుడు శోభన్ బాబు. ఆ తర్వాత వెంకటేష్. అందుకే సంతోషం సబ్జెక్ట్ దర్శకుడు దశరధ్ ముందుగా వెంకీకే చెప్పాడు.

అయితే అప్పటికే ఆ తరహా కథలు చేయడంతో నో చెప్పడంతో నాగార్జున చేసి సూపర్ హిట్ కొట్టాడు. రానా హీరోగా క్రిష్ తెరకెక్కించిన కృష్ణం వందే జగద్గురుం సినిమా కూడా ముందు వెంకీ కోసమే అనుకుని, కథ కూడా చెప్పాడు.. నచ్చింది. అయితే చివరి నిమిషంలో మరో సినిమా రావడంతో వెంకీ ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఆఖరి నిమిషంలో రానా కు వచ్చింది. ఈ మూవీకి కమర్షియల్ విజయం దక్కకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
Govndudu andarivaadele movie
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. తాను రాసుకున్న గోవిందుడు అందరివాడేలే మూవీలో రామ్ చరణ్ బాబాయ్ పాత్రలో వెంకీనే అనుకున్నారు. అయితే ఆయన సైడ్ కారెక్టర్ కి నో చెప్పడంతో శ్రీకాంత్ చేసాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ నటనకి మంచి పేరు వచ్చింది. మారుతి దర్శకత్వంలో రాధా అనే సినిమా చేయడానికి ప్రకటన కూడా వచ్చింది.
Venkatesh
కథ నచ్చి పొలిటికల్ ఫార్మాట్‌లో ఈ కథ వస్తుందని చెప్పాడు వెంకీ. దీనికోసం పోస్టర్ డిజైన్స్ కూడా వేసిన తర్వాత నో చెప్పాడు. అయితే అదే మారుతితో రెండేళ్ల తర్వాత బాబు బంగారం సినిమా వెంకీ చేసి, యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నాడు. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమా క్రాక్ కథ కూడా దర్శకుడు గోపీచంద్ మలినేని ముందు వెంకటేష్ కు చెప్పాడు.
suresh babu and venkatesh
అప్పటికే బాడీగార్డ్ సినిమా ఈ కాంబినేషన్ లోనే వచ్చింది. అయితే ఎందుకో మరి క్రాక్ కథ వెంకీకి కనెక్ట్ కాలేదు. దాంతో అదే కథను రవితేజతో చేసి గోపీచంద్ మలినేని సూపర్ హిట్ కొట్టాడు. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే ఫ్యామిలీ సబ్జెక్ట్ ని దర్శకుడు కిషోర్ తిరుమల మొదట వెంకీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ కథ వెంకీకి నచ్చినా సరే, తెలియదు కానీ చేయలేకపోయాడు. ఇప్పుడు శర్వానంద్, రష్మిక మందన్న జంటగా ఈ మూవీ తెరకెక్కుతోంది.