BalaKrishna-Nagarjuna మధ్య పోటీ ఎప్పుడు ప్రారంభం అయిందో తెలుసా?
Nagarjuna And Balakrishna Movies : టాలీవుడ్ లో హీరోల మధ్య పోటీ ఉండటం సహజమే. ఆ పోటి ఆరోగ్యకరంగా ఉండాలి. అగ్ర నటులు ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. కానీ మంచి మిత్రులుగా కొనసాగారు. ఇక వాళ్ళ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ, నాగార్జున కూడా ఒకానొక దశలో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. నిజానికి బాలయ్య టాలీవుడ్ కి ముందుగా ఎంట్రీ ఇచ్చాడు. దాంతో చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ గట్టిగానే నడిచింది.
ఇక బాలయ్య, నాగ్ ల మధ్య 1987లో గట్టి పోటీ నడిచింది. బాలయ్య హీరోగా నటించిన ఏ కోందండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన భార్గవ రాముడు మూవీ సంక్రాంతి కానుకగా రిలీజయింది. ఒక నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీకి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. విజయశాంతి, మందాకినీ హీరోయిన్స్ గా నటించారు.
ఇక నాగ్ నటించిన మజ్ను మూవీ కూడా అప్పుడే రిలీజయింది. దర్శక రత్న దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రజనీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ భార్గవరాముడు ఓపెనింగ్స్ బాగున్నా రన్నింగ్ లో ఆగింది. అలా బాలయ్యతో పోటీపడి నాగ్ పైచేయి సాధించాడు. అయితే అంతకు ముందు ఎపుడూ పోటీ పడలేదు. పైగా తమ మధ్య విబేధాలు లేవని కూడా ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.