MoviesTollywood news in telugu

Junior NTR తల్లి షాలిని తొలి సారి ఏ సినిమా వేడుకకు వచ్చిందో తెలుసా?

Tollywood Hero Ntr : NTR చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్,ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చిన మూవీ యమదొంగ.

ఎన్నో విశేషాల సమాహారంగా ఉన్న ఈ మూవీ 15కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా కోసం తారక్ సన్నగా మారిపోయాడు. ఇందుకోసం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. అంతకు ముందు కృష్ణవంశీ డైరెక్షన్ లో నటించిన రాఖీ మూవీ వరకూ తారక్ బొద్దుగానే ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ అవుతున్న సమయంలోనే జక్కన్న కలుసుకుని తర్వాత తీయబోయే సినిమా కోసం సన్నబడాలన్న సూచన చేసాడు.

విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా, రత్నం మాటలు రాసాడు. రామోజీ ఫిలిం సిటీలో 300 మంది శ్రమించి సెట్స్ వేశారు. సెంథిల్ కుమార్ 400 టన్నుల లైటింగ్ పెట్టాడట. అప్పట్లో అది పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇక హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, మీరా చోప్రా అనుకుంటే చివరకు ప్రియమణి, మమతా మోహన్ దాస్ సెలక్ట్ అయ్యారు.

మోహన్ బాబు యముడి గెటప్ లో అదిరిపోయాడు. ఇక ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కి తారక్ తల్లి షాలిని హాజరవ్వడం విశేషంగా చెప్పుకున్నారు. ఆమె తొలిసారి తారక్ సినిమా ఫంక్షన్ కి వచ్చింది అప్పుడే దర్శక రత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు ఆడియో వేడుకకు వచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."