Healthhealth tips in telugu

ఖరీదైన మందులు అవసరం లేదు.. బాదంతో తేనె కలిపి తింటే ఆ సమస్యలన్నీ మటాష్!

Honey And Almond Benefits : ఈ సీజన్ లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఖరీదైన మందులు అవసరం లేదు.. బాదంతో తేనె కలిపి తింటే ఆ సమస్యలన్నీ మటాష్!

బాదం పప్పు,తేనె రెండింటిలోను ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తింటే కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Diabetes patients eat almonds In Telugu
ఒక జార్ లో శుభ్రంగా కడిగి ఆరబెట్టిన బాదం పప్పులను వేయాలి. దానిలో బాదం పప్పులు మునిగే వరకు తేనె వేసి మూత పెట్టాలి . వీటిని దాదాపుగా వారం రోజుల పాటు తినవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. బాదంపప్పుతో తేనె కలిపి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉండటమే కాకుండా శారీరక శక్తి పెరుగుతుంది.
Honey benefits in telugu
బాదంపప్పు జింక్, బి విటమిన్లు మరియు ఐరన్ వంటి పోషకాలు సమృద్దిగా ఉన్నాయి. తేనెలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. ఈ మిశ్రమం ఫ్లూ సీజన్‌లో శరీరాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.బాదంలో ప్రోటీన్, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. తేనెలో ఆకలిని నియంత్రించే ఎంజైమ్స్ ఉంటాయి.
Weight Loss tips in telugu

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అయితే రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలో అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
gas troble home remedies
ప్రతి రోజు పరగడుపున తేనెలో నానబెట్టిన రెండు బాదం పప్పులను తీసుకుంటే సరిపోతుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి ఇటువంటి ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆర్గానిక్ తేనె వాడితే మంచిది.

ఈ రోజుల్లో మారిన జీవనశైలి కరన్మగా మనం తీసుకొనే ఆహారం మన జీవితం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రతలు తీసుకోవాలి. బాదం, తేనే కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రాత్రి పూట బాదం పప్పులను నానబెట్టి, ఉదయాన్నే వాటి పొట్టు తీసి, ఒక చెంచా తేనెతో కలిపి తీసుకుంటే పూర్తి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."