MoviesTollywood news in telugu

Ntr, బాలయ్య తొలిసారి ఇక్కడే కలుసుకున్నారట…ఎక్కడో…?

Ntr And BalaKrishna : ఒకప్పుడు హీరోల విషయాలు తెలియాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని నిమిషాల్లో హీరోలకు సంబందించిన విషయాలు చాలా స్పీడ్ గా అభిమానులకు చేరిపోతున్నాయి. ఒకరు ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి నటసింహం బాలకృష్ణ. మరొకరు ఎన్టీఆర్ మనవడు, అచ్చం ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.

వీరిద్దరూ నందమూరి వారసులే. బాలయ్య సోదరుడు దివంగత హరికృష్ణ తనయుడైన జూనియర్ ఎన్టీఆర్ తో బాబాయ్ బాలయ్యతో పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ అంశం గురించి వివరించారు. ఒకసారి పాలకొల్లులో జూనియర్ ఎన్టీఆర్ అల్లరి రాముడు షూటింగ్ జరుగుతోంది. అక్కడ డైరెక్టర్ బి గోపాల్,నిర్మాత చంటి,పరుచూరి గోపాలకృష్ణ ఉన్నారు.

తన తాతయ్యకు అభిమానినైన తాను బాబాయ్ బాలయ్యకు కూడా వీరాభిమానినని జూనియర్ ఎన్టీఆర్ ఈ సందర్బంగా పరుచూరితో అన్నాడట. ఎందుకంటే థియేటర్ లో బాలయ్య బాబాయ్ మూవీ చూస్తూ, కాగితాలు చింపి విసిరేస్తూ ఎంజాయ్ చేసేవాడినని అన్నాడు.

ఈ విషయం మరి బాలయ్యకు ఎప్పుడైనా చెప్పావా అని పరుచూరి అడిగేసరికి, భయం వలన చెప్పలేదని జూనియర్ ఎన్టీఆర్ బదులిచ్చాడట. అయితే ఆ సమయానికి బాలయ్య కూడా అక్కడే ఉండడంతో మీ బాబాయ్ తో మాట్లాడిస్తానని పరుచూరి తీసుకెళ్లారట. అలా ఇద్దరి పరిచయం పాలకొల్లులో అయిందని పరుచూరి వివరించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."