రోజుకి అర గ్లాసు శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

High Cholesterol Remedy In Telugu : ఈ మధ్య కాలంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినటం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

ఉల్లిపాయ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయను మనం రెగ్యులర్ గా ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాం. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. మారిన జీవనశైలి కారణంగా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.

ఉల్లిపాయ టీ తాగితే కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉల్లిపాయటీలో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ సమృద్దిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది. రక్త నాళాలను శుభ్రపరుస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది.

మంచి కొలెస్ట్రాల్ పెరిగితే చెడు కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవడం వలన శరీరంలో చెడు లిపిడ్లు పేరుకుపోకుండా చేస్తుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి సహాయపడతాయి. రక్త నాళాల గోడలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడానికి సహాయపడతాయి.
sompu beenfits
ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మిద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఉల్లిపాయ ముక్కలు,ఒక యాలక్కాయ,రెండు మిరియాలు, అరస్పూన్ సోంపు గింజలు వేసి 7 నుంచి 10 నిముషాలు మరిగించి వడకట్టాలి. ఈ టీలో తేనే, నిమ్మరసం కలిపి తాగితే సరిపోతుంది. ఈ టీని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.