MoviesTollywood news in telugu

Srikanth:ఒక్క ఏడాదిలో స్టార్ హీరోగా మారిన శ్రీకాంత్…ఎన్ని సినిమాలు హిట్…?

Tollywood Hero Srikanth :హీరో, హీరోయిన్ ల గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి ప్రతి ఒక్క అభిమాని సిద్దంగా ఉంటాడు. విలన్, క్యారెక్టర్ పాత్రలు,యాక్షన్ పాత్రలతో నెట్టుకొస్తూ హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ ని 1997 సంవత్సరం స్టార్ హీరో చేసింది. ఆ ఏడాది జనవరిలో వచ్చిన ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్ లోని తాళి మూవీ మంచి వినోదం పంచింది. రాజేంద్రప్రసాద్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ సినిమా హిట్ తర్వాత అదే నెలలో 30వ తేదీన ఎగిరే పావురమా మూవీ వచ్చింది.

ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో జెడి చక్రవర్తి సెకండ్ హీరోగా చేసాడు. లైలా హీరోయిన్ గా చేసింది. లవ్ అండ్ కామెడీతో నడిచిన ఈ సినిమా ఆడియన్స్ ఆదరణ చూరగొంది. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే ఆహ్వానం మూవీ మే 2న రిలీజయింది. రమ్యకృష్ణ హీరోయిన్. ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా అలరించింది. బ్లాక్ బస్టర్ మూవీగా నిల్చింది.

అదే ఏడాది సౌందర్య హీరోయిన్ గా శ్రీకాంత్ హీరోగా తారక రాముడు మూవీ వచ్చి హిట్ గా నిల్చింది. ఉదయ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి కోటి స్వరాలు అందించాడు. తర్వాత హలొ ఐ లవ్ యు మూవీ ప్లాప్ అయింది. అయితే నాలుగు రోజుల గ్యాప్ తో కృష్ణంరాజుతో కల్సి నటించిన మానాన్నకు పెళ్లి మూవీ మళ్ళీ హిట్ ఇచ్చింది. తాళి మూవీతో హిట్ ఇచ్చిన ఈవీవీ డైరెక్షన్ లోనే ఆ ఏడాది ఆఖరి మూవీ మానాన్నకు పెళ్లి మూవీకి డైరెక్టర్ కావడం విశేషం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."