ఎర్ర క్యాప్సికమ్ ని ఎప్పుడైనా తిన్నారా…లేదంటే ఎన్నో లాభాలను మీరు మిస్ చేసుకున్న‌ట్లే..!

Red capsicum Health benefits in telugu : ఎరుపు,పసుపు,ఆకుపచ్చ రంగులలో ఉండే క్యాప్సికమ్ లు మనకు లభ్యం అవుతున్నాయి. అయితే మనలో చాలా మంది ఆకుపచ్చ రంగులో ఉండే క్యాప్సికమ్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎర్ర క్యాప్సికమ్ లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా వాడటం ప్రారంభిస్తారు.
red capsicum
వీటిలో విటమిన్ A మరియు బీటా కెరోటిన్ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడటమే కాకుండా కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. Red capsicum లో ధర్మోజెనిసిన్ ఉండుట వలన బరువును తగ్గిస్తుంది.

హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. విటమిన్ సి కూడా చాలా సమృద్దిగా ఉండుట వలన ఇనుము యొక్క సరైన శోషణకు సహాయపడుతుంది. Red capsicum లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్దిగా ఉంటాయి. అలాగే లైకోపీన్‌ అత్యధికంగా ఉండే కూరగాయలలో ఇది ఒకటి. విటమిన్ B6 మరియు మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా విటమిన్ B6 కూడా ఒక సహజ మూత్రవిసర్జనగా పనిచేసి కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
Immunity foods
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం Red capsicum చాలా విరివిగానే లభ్యం అవుతున్నాయి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కాబట్టి అవకాశం ఉంటే మాత్రం Red capsicum తినటం మానకండి. వీటిని తిని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.