Kitchenvantalu

Ginger Garlic Paste: ఈ కొలతల ప్రకారం అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ తయారు చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..!

Ginger garlic paste Store Tips: మసాలా వంటలు చేసినప్పుడు అల్లం,వెల్లుల్లి పేస్ట్ తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వంటలకు మంచి రుచిని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మనలో చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు.

ఇలా ఫ్రిజ్ లో పెట్టటం వలన ఒక రకమైన వాసన వస్తుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే వాసన రాకుండా తాజాగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని జిప్ లాక్ బ్యాగ్ లో నిల్వ చేస్తే చాలా రోజులు తాజాగా ఉంటుంది. ఇందులోకి గాలి లోపలకి వెళ్ళదు. ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. అయితే ఈ జిప్ బ్యాగ్స్ లీక్ అవ్వడం, చిరిగిపోకుండా చూసుకోవాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మిక్సీ చేసినప్పుడు కొంచెం ఉప్పు, నూనె వేస్తె ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే ఎలాంటి వాసన రాదు. కూరల్లో వేసేటప్పుడు కాస్తా ఉప్పు, నూనె తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం ఆలీవ్ ఆయిల్ వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

అయితే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసే సమయంలో నీరు పోస్తూ ఉంటారు. ఇది అంత మంచిది కాదు. త్వరగా పాడవుతుంది. సాధ్యమైనంత వరకూ నీరు పోయకుండా కొద్ది కొద్దిగా మిక్సీ పడుతుంటే చాలు. బాగా మెత్తగా అవుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."