Kitchenvantalu

ప్రతి ఇల్లాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన బెస్ట్ కిచెన్ టిప్స్.. అస్సలు మిస్ అవ్వొద్దు!

Useful Kitchen Tips in telugu:వంట చేయడం ఒక కళే కావచ్చు, కానీ పొద్దున్నే హడావిడిగా వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు మన సహనాన్ని పరీక్షిస్తుంటాయి. పాలు పొంగిపోవడం, హడావిడిలో కూరలో ఉప్పు ఎక్కువవడం, లేదా ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు త్వరగా వాడిపోవడం.. ఇవన్నీ మన ఇళ్లలో రోజూ జరిగేవే.

కానీ, కొన్ని చిన్న చిన్న ‘కిచెన్ టిప్స్’ తెలిస్తే చాలు, ఈ సమస్యలన్నింటినీ చిటికెలో మాయం చేయవచ్చు. మీ వంటగది పనులను మరింత సులువుగా, స్మార్ట్‌గా మార్చి మీ సమయాన్ని, శ్రమను ఆదా చేసే అద్భుతమైన చిట్కాలను ఈ పోస్ట్‌లో మీకోసం తీసుకొచ్చాను. ఇవి తెలిస్తే వంట చేయడం ఇక ఏమాత్రం కష్టం అనిపించదు!

Lemon peel Health benefits
lemon peel on wood background

మనం సాదారణంగా నిమ్మకాయలను నిమ్మరసం తీసేసాక నిమ్మ తొక్కలను పాడేస్తూ ఉంటాం. అలా కాకుండా నిమ్మ తొక్కలను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆవిరి మీద ఉడికించి ఉప్పు,కారం కలిపి పోపు పెడితే నోరూరించే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది…అలాగే మంచి రుచిగా ఉంటుంది.

దోసెల పిండి రుబ్బినప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం వేసి రుబ్బితే దోసెలు చిరగకుండా పల్చగా వస్తాయి.

దోసెలు పెనానికి అతుక్కోకుండా బాగా రావాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. దోసె వేయటానికి ముందు పెనంపై వంకాయ ముక్కతో రుద్దండి.

కేక్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిసరిన్ కలపాలి.

కొత్తగా కొన్న జామ్ సీసా మూత గట్టిగా ఉండి తియ్యడానికి రాకపోతే, మూతను మంటమీద కొద్దిగా వేడి చెయ్యండి.

జామ్ గడ్డకడితే, దానిలో బాగా వేడిచేసిన నీరు నాలుగు చెంచాలు పోస్తే మెత్తబడుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."