Kitchenvantalu

Cooker Cleaning Tips:మీ ఇంట్లో కుక్కర్ గార పట్టి పసుపు రంగులోకి మారిందా .. చిటికెలో ఇలా శుభ్రం చేయండి..

Cooker Cleaning Tips in telugu:ప్రతిరోజు మనం కుక్కర్ ని వాడుతూ ఉంటాం. కుక్కర్ లో ఏదైనా వంటకాన్ని వండటం చాలా సులభం. కుక్కర్ లో వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. అంతే కాకుండా ఆహారం కూడా చాలా త్వరగా రెడీ చేసుకోవచ్చు. అయితే కుక్కర్ ని ఎక్కువగా వాడటం వల్ల చాలా తొందరగా మురికి పట్టేస్తూ ఉంటుంది. ఆ మురికిని మనం అశ్రద్ద చేస్తే పసుపు రంగులోకి మారుతుంది.

కుక్కర్ పసుపు రంగును తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఈ విధంగా కుక్కర్ లో మురికి, పసుపు రంగు పేరుకుపోవటం కారణంగా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. బేకింగ్ సోడా, ఉప్పు సమాన పరిమాణంలో తీసుకుని దానిలో నిమ్మరసం వేసి పేస్ట్ గా తయారు చేయాలి. కుక్కర్ లోపల పసుపు రంగులో మారిన ప్రదేశంలో రాసి ఐదు నిమిషాలు అలా వదిలేయాలి.

ఆ తర్వాత స్పాంజీతో శుభ్రం చేయాలి. ఈ విధంగా చేయడం వలన కుక్కర్ లో పసుపు రంగు తొలగిపోతుంది. ఉల్లిపాయ తొక్క కూడా కుక్కర్ శుభ్రం చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. కుక్కర్ లో ఉల్లిపాయ తొక్కలు వేసి నీటిని పోసి వేడి చేయాలి. ఇలా చేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలు మరియు నీటిని తీసివేసి డిష్ వాష్ తో శుభ్రంగా కడగాలి.
salt Beauty Tips In Telugu
ఈ విధంగా చేస్తే కుక్కర్ కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇప్పుడు చెప్పిన రెండు చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మీకు వీలును బట్టి ఈ చిట్కాలను ఉపయోగించండి. చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా పసుపు రంగులో మారిన కుక్కర్ ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."