అక్కినేని హీరోల పేర్ల ముందు ‘నాగ’ అని ఎందుకు ఉంటుందో తెలుసా…?
Akkineni Family : సినిమా నటుల గురించి తెలుసుకోవటానికి మనలో ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ సుశీల, నాగ చైతన్య.. వీరి అందరి పేర్ల ముందు ‘నాగ’ ఉండటం మనం గమనించాం. అయితే ఆలా పెట్టటానికి గల కారణం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారా?

అది వాళ్ళ ఆచారమా? దీని గురించి నాగార్జున ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి ప్రతి రోజు నాగుపాము కలలోకి వచ్చేదట. అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన కొన్ని రోజులకు వాళ్ళ అమ్మగారు పాలు పట్టిస్తూ ఉండగా పాము పిల్ల కనిపించదట. దాంతో వాళ్ళ అమ్మగారు నాగేశ్వరరావు అని పేరు పెట్టారు.

ఆ తర్వాత అది అక్కినేని నాగేశ్వరరావు గారు వారి పిల్లలకు నాగ కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. చైతన్య కు కూడా నాగ కలపమని నాగార్జున వాళ్ళ అమ్మగారు ప్రత్యేకంగా చెప్పారట. అందుకే చైతన్య కాస్త నాగ చైతన్య అయ్యాడు.
Click Here To Follow Chaipakodi On Google News

