Neem Seeds:వేపగింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో …
Neem Seeds:వేపగింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో … వేప ఆకులోని ఔషధగుణాలు గురించి మనకు తెలిసినదే. కొన్ని వేల సంవత్సరాల నుండి వేపాకును వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఒక్క వేప ఆకులోనే కాదు, వేప గింజలు, వేప నూనె, వేప బెరుడు ఇలా అన్ని రకాలుగా మనకు ఔషధ పరంగా బోలెడ్ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి.
మనలో చాలా మందికి వేప చెట్టు నుంచి వచ్చే ఆకులు, వేప చిగురు, బెరడు, పువ్వు గురించి మాత్రమే తెలుసు. కానీ వేప గింజలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. పూర్వ కాలం నుండి మన పూర్వికులు వేప గింజలను వాడుతూ ఉన్నారు. వేప గింజలతో పొడి తయారు చేసుకోవచ్చు.

వేప గింజలతో నూనెను కూడా తయారు చేస్తూ ఉంటారు. వేప గింజలతో పొడి తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి రకరకాల వైరస్లు దరిచేరకుండా రక్షణ లభిస్తుంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. కడుపులో ఏమైనా నులిపురుగులు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

వేప గింజలు గురించి తెలియని ఒక విషయం ఏమిటంటే నాచురల్ బర్త్ కంట్రోల్ గా పనిచేస్తాయి. కాబట్టి వేప గింజలు తీసుకుంటే అవాంఛిత గర్భాన్ని నివారించుకోవచ్చు. కాబట్టి గర్భధారణ సమయంలో వేప గింజల కు చాలా దూరంగా ఉండటం మంచిది. వేప గింజల లో బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి.

వేప గింజల పొడి లో నీటిని కలిపి పేస్టులాగా తయారుచేసి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు మరియు నల్లటి మచ్చలు తొలగి పోతాయి. అలాగే పైల్స్ సమస్య ఉన్న వారు వేప గింజలను పొడి రూపంలో తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. వేప గింజల పొడి ఆయుర్వేదం షాప్ లలో లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

