Beauty TipsHealthhealth tips in telugu

ఈ ఒక్క షాంపూ చాలు.. చుండ్రు మాయం, జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

Homemade Herbal shampoo : దువ్వెన మీద జుట్టు చూసి భయమేస్తోందా? చుండ్రు సమస్య వల్ల నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? అయితే మీరు ఒంటరి కాదు, మనలో చాలా మంది ఫేస్ చేసే రెగ్యులర్ ప్రాబ్లం ఇది. మార్కెట్లో దొరికే ఎన్నో ప్రోడక్ట్స్ వాడి విసిగిపోయి ఉంటే..

ఈ ఒక్క షాంపూ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. జుట్టు రాలడాన్ని తగ్గించి, చుండ్రును మాయం చేసి.. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా పెంచే ఆ అద్భుతమైన షాంపూ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో మీకోసం రాశాను. లేట్ చేయకుండా చదివేయండి!

ఒకప్పుడు తల రుద్దుకోవటానికి కుంకుడు కాయలు,శీకాయలు వాడేవారు. కానీ ఇప్పుడు మనలో చాలా మంది షాంపూలు వాడుతున్నారు. షాంపూ ఎక్కువగా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ రోజు మనం ఎటువంటి కెమికల్స్ లేకుండా షాంపూ తయారుచేసుకుందాం.

దీనికి కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. ఒక స్పూన్ మెంతులను నీటిని పోసి ఆరు గంటలు నానబెట్టాలి. పది కుంకుడు కాయలను తీసుకొని వాటిలోని గింజలు తీసేసి నీటిని పోసి మూడు లేదా నాలుగు గంటల పాటు నానబెట్టాలి. ఒక మిక్సీ జార్ లో నానిన మెంతులు,నానిన కుంకుడు కాయలు, నాలుగు మందార ఆకులను వేసి మిక్సీ చేసుకోవాలి.
Homemade Herbal Shampoo
ఈ మిశ్రమాన్ని వడకట్టి తల రుద్దుకోవాలి. ఈ షాంపూని ఫ్రిజ్ లో పెడితే పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేసి జుట్టుకి పోషణ అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా,మెరిసేలా చేస్తుంది. అలాగే కుంకుడు కాయలో ఉండే విటమిన్ లు జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది.

స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ ని పూర్తిగా శుభ్రం చేయటం వలన చుండ్రు సమస్య ఉండదు. మెంతులు మూలాల నుండి జుట్టును బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. మందార ఆకులో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా చేసి ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."