MoviesTollywood news in telugu

‘బ్రో’ సెన్సార్ కంప్లీట్.. పవన్ కళ్యాణ్ నిడివి ఎంతంటే..?

BRO Movie:సముధ్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో మొదటి సారిగా వస్తున్న BRO సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తమిళంలో భారీ విజయాన్ని సాధించిన వినోద సీతమ్ మూవీకి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా ప్రేక్షకులను అలరించటానికి సిద్దం అయ్యారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ అన్నీ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ అని తెలుస్తోంది.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ తమిళ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ నటిస్తూ ఉండటం వలన telugu సినిమా స్థాయి పెరిగిందని చెప్పుతూ…పవన్ పాత్ర నిడివి…మొదటి 10 నిమిషాలు పవన్ కనిపించరట. ఆ తరువాత అక్కడి నుంచి సినిమా ముగిసే వరకు పవన్ కనిపిస్తారని చెప్పుకొచ్చారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."