Bro: “బ్రో” సినిమాలో ఆ ఒక్క షాట్ కు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా…?
BRO Movie:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో మొదటి సారిగా వచ్చిన BRO సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అభిమానుల ఆదరణతో సక్సెస్ గా థియేటర్స్ లో ప్రదర్సన జరుగుతుంది. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ గా వచ్చిన బ్రో సినిమాను తెలుగు మరియు తమిళ భాషల్లో సముద్రఖనియే దర్శకత్వం వహించారు.
అయితే త్రివిక్రమ్ telugu అభిమానులకు తగ్గట్టుగా పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులను చేసారు. ఈ సినిమా అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మొత్తానికి ఈ సన్నివేశమే హైలైట్ గా నిలిచింది. ఈ సన్నివేశం సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది.
ఈ సన్నివేశం తీయటానికి దాదాపుగా 200 కెమేరాలను వాడారట. ఈ ఒక్క సన్నివేశం తీయటానికి దాదాపుగా మూడు కోట్ల రుపయిలను ఖర్చు చేసారట. ఖర్చుకి తగ్గట్టుగా మరియు కష్టానికి మంచి ప్రతిపలం దొరికింది.

