Healthhealth tips in telugu

Eating Curd:రాత్రి సమయంలో పెరుగన్నం తింటున్నారా…ఈ నిజాలు తెలుసుకోండి

Eating Curd: పెరుగులో ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ రాత్రి సమయంలో పెరుగు తింటే మంచిది కాదని ఆయుర్వేదం చెప్పుతుంది. మనలో చాలా మందికి పెరుగన్నం తినకపోతే అన్నం తిన్నా ఫీలింగ్ రాదు. అయితే రాత్రి సమయంలో పెరుగన్నం తింటే…పెరుగులో తీపి, పులుపు రెండూ ఉండుట వలన నాసికా మార్గంలో శ్లేష్మం ఏర్పడుతుంది.

కీళ్ళనొప్పులు ఉన్నవారికి నొప్పులు కూడా పెరుగుతాయి. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో పెరుగు వాడకాన్ని బాగా తగ్గించాలి. లేదంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఆస్తమా, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అసలు రాత్రి సమయంలో పెరుగు తీసుకోకూడదు. మధ్యాహ్న సమయంలో తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి.

పెరుగన్నంలో చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. కాబట్టి పెరుగన్నం తినే సమయంలో ఈ విషయాన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."