Healthhealth tips in telugu

Leg Finger:కాలి వేళ్లలో బొటనవేలి కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమవుతుందో తెలుసా..?

Leg Finger Size:మీరు ఎప్పుడైనా మీ కాలి వేళ్ళను జాగ్రత్తగా గమనించారా..?! జాగ్రత్తగా గమనిస్తే కాలికి ఉన్న వేళ్ళు ఒక దాని తర్వాత ఒకటి పొడవు తగ్గుతూ ఉండటం గమనిస్తాము.అయితే కొంతమంది కాలి వేళ్ళు వేరుగా ఉండటం కూడా మనం గమనిస్తూ ఉంటాము.కాకపోతే కొంతమంది అమ్మాయిలకి కాలి బొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.

అలాగే మరి బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. బొటనవేలి పక్కన వేళ్ళు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే కాలివేళ్ళకు సంభందించిన అన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్ధగా ఉండే వారు చాలా తెలివి కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కాస్త ఎక్కువే.

బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా సులభంగా చేయగలరు. వీరు మల్టీటాస్కర్‌ అనమాట.

మీకాలి రెండవ వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు.

బొటనవేలి పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు.

కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరివి చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. వీరిలో ఊహించని శక్తి దాగి ఉంటుంది.

బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్‌ని అన్ని కోణాల్లో ఎంజాయ్‌ చేయగలరు. వీరు పై పని భారం అంతగా ఉండదు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు.

కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉండే వారు ఫ్యామిలీకి ప్రాముఖ్యతని ఇస్తారు. వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వింటారు.

కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉంటే వారికి ఫ్యామిలీ పట్ల రిలేషన్‌ షిప్స్‌ పట్ల పెద్ధగా ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు విలువ ఇవ్వరట.

చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారు. కాని వీరిని అందరూ ఇష్టపడరట.

చిటికెన వేలు నాల్గవ వేలికి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహంస ప్రియులు. అలాగే వీరు చాలా చక్కగా చమత్కారంగా మాట్లాడుతారట.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."