Weight Loss:మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ జ్యుస్ త్రాగితే…ఊహించని ప్రయోజనాలు
Weight Loss Drink :ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి,ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం, వ్యాయామం చేయకపోవటం, ఎక్కువ సేపు అలా కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్య అనేది పెద్ద సమస్యగా మారింది.
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఉబకాయంతో అవస్తలు పడుతున్నారా? ఎక్కడికి వెళ్ళినా అందరూ మిమ్మల్ని హేళన చేస్తున్నారా? బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారిందా? మీరు ఎంత ప్రయత్నించినా మీకు స్థూలకాయం సమస్య తీరడం లేదా? అయితే మీలాంటి వారి కోసమే ఒక ఆయుర్వేద ఔషదం ఉంది.
దీనిని బోజనానికి ముందు 1 గ్లాస్ త్రాగితే చాలు. కనీసం నెల రోజుల వ్యవధిలోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఇది మీ పొట్టలో అదనపు కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాకుండా మీ శరీరంలో ఉండే అధికమైన నీటిని తొలగించి శక్తిని పెంచుతుంది.
కావాల్సిన పదార్ధాలు:
250 గ్రాముల ముల్లంగి
8 నిమ్మకాయలు
100 గ్రాముల అల్లం
6 టేబుల్ స్పూన్ల తేనె
4 టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్క
తయారీ విధానం:
ముల్లంగి అల్లం కలిపి మిక్సీ చేసుకోండి. దీనికి నిమ్మరసాన్ని కలపండి. మళ్ళీ మిక్సీ చేసుకోండి. దాల్చిన చెక్క, తేనె కలిపి మెత్తగా వచ్చేంత వరకూ మిక్సీ చేయండి. ఒక గాజు పాత్రలో ఈ మిశ్రమాన్ని తీసుకోండి. భోజనం ముందు 1 టీ స్పూన్ మిశ్రమాన్ని తీసుకోండి. డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకుని తాగచ్చు. ఇలా 5 వారాలపాటు చేస్తే మీ పొట్టలో కొవ్వు కరిగి మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

