White Hair:మీ జుట్టు తెల్లగా ఉందని బాధపడుతున్నారా.. ఈ ఆకును ఇలా వాడితే నల్లటి జుట్టు మీ సొంతం!
White Hair Tips in Telugu :ఈ మధ్య కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులోనే చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే, జామ ఆకును ఇలా వాడితే పొడవాటి నల్లటి జుట్టు మీ సొంతం అని నిపుణులు చెబుతున్నారు.
జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి సైడ్ effects లేకుండా ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. అలా చిన్న వయస్సులోనే రావటంతో మానసికంగా క్రుంగిపోతున్నారు. అలాగే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల హెయిర్ డ్రై లను వాడేస్తూ ఉంటున్నారు.
దాంతో జుట్టు రాలే సమస్య వస్తుంది. అలా కాకుండా కాస్త ఓపికతో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం కేవలం రెండు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో జామ ఆకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. జామ ఆకుల రసంలో 2 స్పూన్ల బాదం ఆయిల్ కలిపి జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాను ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారటమే కాకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జామ ఆకులు చాలా సులభంగానే అందరికి అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

